13 May, 2026 | 2:23 AM

అమెరికాలో.. "మోదీ&యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్" కార్యక్రమం

28-08-2024 03:58 PM

న్యూయార్క్: మోదీ&యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ జరగనుంది. కాగా ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జరుగనున్న ఈ కార్యక్రమానికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదిక కానుంది. ఈవెంట్ కు అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి 42 రాష్ట్రాలనుంచి భారతీయ అమెరికన్లు హాజరవుతారని  ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ  (IACU)ప్రతినిధులు  అంచనా వేశారు. ఈవేదిక సామర్థ్యం 15 వేలు మాత్రమే.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.  కాగా యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం లో సెప్టెంబర్ 26న ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.