తొండరడిప్పొడి ఆళ్వారు జీవిత చరిత్ర
‘విప్రనారాయణ’ చిత్రం 1954 డిసెంబర్ 10న విడుదలైంది. ఈ సినిమా ను భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి, రామకృష్ణారావు నిర్మించారు. పీఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీరంగని భ క్తుడైన విప్రనారాయణ (అక్కినేని) పరమ నిష్టాగరిష్టుడైన పూజారి. ఓసారి నర్తకి దేవదేవి (భానుమతి) నమస్కరించగా విప్రనారాయణ గమనించడు. దీంతో ఆమెలోని అహంభావం పడగవిప్పి అతడిని ఎలాగైనా తన పాదాక్రాంతుడిని చేసుకుంటానని అక్కతో దేవదేవి సవాల్ చేస్తుంది. భక్తి నెపంతో తాను ఏకాకినని చెప్పి విప్ర నారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. మెల్లమెల్లగా విప్రనారాయణుడిలో చలనం కలిగిస్తూ భక్తి మార్గం నుంచి తప్పించి తను లేనిదే క్షణం కూడా ఉండలేని స్థితికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సినిమాలో చూపించారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వారు.. ‘విప్రనారాయణ’ పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన జీవిత చరిత్రే ఈ సినిమా.






