విక్రమ్‌లో రెండు కోణాలు
చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. హెచ్‌ఆర్ పిక్చ ర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించారు. ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. కిరాణా కొట్టులో హీరో ఉండటం.. సరుకుల కోసం మహిళ రావడం.. ‘నా కూతురికి డిస్టర్బ్ అవుతుంది.. మెల్లిగా అడుగు’ అని హీరో అనడం.. జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తర్వాత వెంటనే గన్‌తో విధ్వంసం సృష్టించడం.. వంటివి టీజర్‌లో చూపించారు. విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించారు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్‌జే సూర్య నటించారు. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్‌లు బాగా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.






