14 July, 2026 | 7:19 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా

14-07-2026 07:18 PM

సవరణ ప్రక్రియ పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

ఉప్పల్,(విజయక్రాంతి): ప్రతి ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా వివరాలను నమోదు చేయడం ద్వారానే ఖచ్చితమైన ఓటరు జాబితా తయారవుతుందని శక్తి సాయి నగర్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్వి కిట్టు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ శక్తి సాయి నగర్ డివిజన్ చాణిక్యపురి   కాలనీ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు జాబితా సవరణ సర్ ప్రక్రియను కాలనీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసిఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్ ప్రక్రియపై ఏదైనా సందేహాలు ఉంటే  చాణిక్యపరి కాలనీలోని ఉన్న కమిటీ  హాల్ వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు బిఎల్ఏలు అందుబాటులో ఉంటారని మీ యొక్క ఎస్ ఆర్ ఐ ఫామ్స్ నింపి కమిటీ హాల్లో వద్ద ఉన్న అధికారులకు ఇవ్వాల్సిందిగా ఆయన సూచించారు. సర్ పక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే  మీయొక్క గుర్తింపు కార్డులు తీసుకొని వస్తే ఇక్కడ అధికారులు మీ ఫామ్ నింపి మీ సందేహాలు తీరుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాణిక్యపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు  అధికారులు పాల్గొన్నారు.