14 July, 2026 | 7:19 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

మెగాస్టార్ ఓకే చేసిన కథ

10-12-2024 12:00 AM

ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది దీనికి ట్యాగ్‌లైన్. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ధర్మ మాట్లాడుతూ.. “డ్రింకర్ సాయి’ మూవీ ట్రైలర్ చూసి నన్ను కొంతమంది తిడుతున్నారు. కానీ సినిమా చూస్తే ఒక్కరు కూడా తిట్టరు. డ్రింకర్ సాయి మీకు నచ్చుతాడని బల్లగుద్ది చెబుతున్నా. కొంతమంది పెద్ద వయసు వాళ్లకు షో వేశాం.. బాగుందన్నారు” అన్నారు. హీరోయిన్ ఐశ్వర్యశర్మ మాట్లాడుతూ.. ‘టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేశారు’ అని చెప్పారు. “డ్రింకర్ సాయి’ కథ చాలా బాగుందని జీకే మోహన్ చిరంజీవికి మెసేజ్ పంపిస్తే ఆయన ఓకే అని రిప్లు ఇచ్చారు. అలా మెగాస్టార్ అంగీకారంతో ఈ  సినిమా మొదలైంది. ఆయన నో చెప్పి ఉంటే ఈ సినిమా ఉండేది కాదు” అని డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి తెలిపారు. నిర్మాతలు ఇస్మాయిల్ షేక్, లహరీధర్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లక్ష్మి, నటి కిర్రాక్ సీత, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.