7 August, 2026 | 9:36 PM

విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలి

07-08-2026 08:54 PM

పద్మశాలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు  వేముల రామ్మూర్తి, అయిల రమేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వేముల రామ్మూర్తి , ఆయిల రమేష్ లు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కీర్తిశేషులు పెగడ చందు జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు పెగడ శారద ఐలయ్య, పరశురాములు లు  జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సాయిరీ మహేందర్, పదవ తరగతి విద్యార్థులకు నోటుబుక్స్ పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెగడ చందు అకాల మృతి చెందడంతో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చందు పేరుమీద  విద్యార్థులకు సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు చేపట్టడం అభినందనీయమని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.