పుట్టినరోజు రెండు సినిమాల ప్రకటన
నటుడు శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా ‘పరాక్’ మూవీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘బ్రాండ్ స్టూడియోస్’ హాలేష్ కోగుండి టీమ్ రూపొందించనుంది. ఈ ప్రాజెక్ట్ మార్చిలో సెట్స్ పైకి రానుంది. శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బ్రాండ్ స్టూడియోస్’ టీం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో..
శ్రీమురళి ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సైతం ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బఘీర మంచి విజయం సాధించిన తర్వాత శ్రీమురళి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. టాలీవుడ్‌లో భారీ విజయాలను అందుకున్న ఈ సంస్థ కన్నడలో సైతం చిత్రాలను రూపొందిస్తోంది. శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్, దర్శకుడు, నటీనటులు, మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.






