ప్రశాంత్ వర్మ పరిచయం చేయరా?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలొచ్చాయి. అధికారికంగా సినిమాను కూడా లాంచ్ చేశారు కానీ షూటింగ్ ప్రారంభం కావల్సిన రోజే ఆగిపోయింది. దీంతో ఓ కన్ఫ్యూజ న్ ప్రారంభమైంది. మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదని, అందు కే షూటింగ్ వాయిదా పడిందని బాలకృష్ణ మీడియాకు తెలిపారు. దీంతో మోక్షజ,్ఞ ప్రశాంత్ వర్మల మూవీ క్యాన్సిల్ అయ్యిందని టాక్ నడుస్తోంది.
మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ పరిచయం చెయ్యరని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ఇద్దరు దర్శకులతో మాట్లాడారంటూ ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌లో వెంకీ అట్లూరితో, నాగ్ అశ్విన్‌తోనూ మోక్షజ్ఞ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి 2’తో బిజీగా ఉండటంతో వెంకీ అట్లూరితో ముందుగా సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ‘ఆదిత్య 369’ సీక్వెల్ అయిన ‘ఆదిత్య 999’లో కూడా హీరో మోక్షజ్ఞే అని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.






