మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ జన్మదిన వేడుకలు
సత్తుపల్లి. ఆగస్టు 7, (విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్(Former Municipal Chairman Kusampudi Mahesh) జన్మదినాన్ని పురస్కరించుకుని 3వ వార్డులో మేకల నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరప్పనేని బాబి గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి, కూసంపూడి మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేష్ ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడని కొనియాడారు.
ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్ పాషా, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, అక్షింతల చంటి, క్లబ్ వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీను, వేదుల నాగు, పంతంగి నరసింహారావు, చల్లపల్లి సాంబ, బాబూరావు, పుల్లారావు, లడ్డూ, కిషోర్, మహదేవ మధు, వాసు, మల్లేష్, పర్శ కృష్ణయ్య, వసంతం, అర్జున్, పర్శ ధర్మారావు, డేవిడ్ తదితరులు పాల్గొని మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






