అంగన్‌వాడీలో తల్లిపాల వారోత్సవాలు
కోనరావుపేట ఆగష్టు 07 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు వివరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పోషకాహారమని, పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.అలాగే "తల్లిపాలు – బిడ్డకు తొలి ఆరోగ్య కవచం", "ఆరోగ్యవంతమైన బిడ్డలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది" అనే సందేశాలను తెలియజేస్తూ, ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.






