7 August, 2026 | 1:14 PM

బొమ్మ సత్య ప్రసాద్ మృతికి మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు సంతాపం

07-08-2026 12:30 PM

ఖమ్మం, ఆగస్టు, 7(విజయక్రాంతి): బొమ్మ విద్యా సంస్థల అధినేత బొమ్మ సత్య ప్రసాద్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్య ప్రసాద్ మరణ వార్త తెలిసి ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున ఆయన శుక్రవారం మృతుని తండ్రి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు కు ఫోన్ చేసి సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్త పర్చి, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్బంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తనయుడు నిఖిల్ చంద్ర ఖమ్మం ముస్తఫా నగర్ లో ఉంచిన బొమ్మ సత్య ప్రసాద్ పార్ధివ దేహానికి అంజలి ఘటించారు. అనంతరం ఆయన తండ్రి బొమ్మ రాజేశ్వరరావును ఓదార్చారు.