24 July, 2026 | 4:25 PM

బీజేపీకి చేదు అనుభవం

05-06-2024 02:19 AM

హర్యానాలో పది లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తాజా ఫలితాల్లో ౫ సీట్లు బీజేపీ గెలుచుకోగా, మిగిలిన ౫ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ౨౦౧౯ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ  ఏకంగా పదికి పది స్థానాలు గెలుచుకోగా, ఈసారి ఐదు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బాగానే పుంజుకుంది. ఇక్కడ మొత్తం ౧.౯౭ కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ సిర్సా, రోహతక్, సోనీపట్, హిసార్, అంబాలా స్థానాల్లో గెలుపొందగా, భివానీ గురుగ్రామ్, ఫరీదా బాద్, కర్నాల్, కురుక్షేత్ర స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.