24 July, 2026 | 5:17 PM

9 సీట్లు కోల్పోయిన బీజేపీ

05-06-2024 02:17 AM

కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు షాకిస్తూ 28 స్థానాలకు గాను 17 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకుంది. బీజేపీతో జట్టు కట్టిన జనతాదళ్(సెక్యులర్) 2 స్థానాల్లో గెలిచింది. ఇటీవల రాష్ట్రంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ హసన్‌లో ఓడిపోయారు. పోలింగ్‌కు ముందు రోజే అశ్లీల వీడియోలు వైరల్ కావడం ప్రజ్వల్‌కు ప్రతికూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.  2019లో 28 గాను 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గడం గమనార్హం.