బీజేపీ క్లీన్‌స్వీప్
05-06-2024 02:20 AM
లోక్‌సభ ఎన్నికల బీజేపీ హవా కొనసాగించింది. రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ స్థానాలు ఉండగా, నాలుగు స్థానాలనూ గెలుచుకుని బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ౨౦౧౪, ౨౦౧౯ ఎన్నికల్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. చివరి విడతలో భాగంగా ఇక్కడ జూన్ ౧వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం ౫౫.౬౧ లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్, హమీర్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గెలుపొందారు. కాంగ్రా నుంచి రాజీవ్ భరద్వాజ్, సిమ్లా నుంచి సురేశ్ కుమార్ కశ్యప్ విజయం సాధించారు.






