calender_icon.png 6 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటేసి గెలిపిస్తే మీ వెన్నంటే ఉంటా!

06-02-2026 12:42:19 AM

గజ్వేల్ 20వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉప్పల మధుసూదన్

గజ్వేల్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): 40 ఏళ్లుగా ప్రజలతోనే మమేకమై లేదబ్బా రాజకీయాల్లో ఉన్నానని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నానని, 20వ వార్డు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల వెన్నెంటే ఉంటానని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పల మధుసూదన్ అన్నారు. గురువారం ఆయన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఓటును అభ్యర్థిస్తూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మోడీ ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ బియ్యాన్ని, ఉజ్వల యోజన గ్యాస్ కలెక్షన్  అందిస్తుందన్నారు. ప్రజలు కౌన్సిలర్‌గా గెలిపిస్తే అవి నీతి అక్రమాలకు తావులేకుండా అభివృద్ధి చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందు ఉంటాన న్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు ప్రజలు తమ అమూల్య మైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, బారు అరవింద్, శ్రీనివాస్, బాసు రాజు, ఆనంద్ సాయి, చింత కృష్ణ, లక్ష్మణ్, ఉమ, సుమతి, మమత, సరిత, నీరజ,  భ వాని తదితరులు పాల్గొన్నారు.