30 July, 2026 | 4:12 PM

గిరిజనులకు నిరంతర సేవలు

30-07-2026 03:40 PM

* అత్యవసర సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలి..

* ఐటీడీఏ పీవో మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో  గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో గిరిజనులకు అత్యవసర సేవలు అందించుటకు  ఐటిడిఏ అధికారులు సిద్ధంగా ఉన్నారని  ఐటీడీఏ పీవో  మంద మకరందు తెలిపారు. అత్యవసర సమయంలో ఐటీడీఏ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 18004255226, 08731- 275226  సమాచార అందించాలన్నారు. వైద్య బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని  వైద్య సిబ్బందిని పిఓ ఆదేశించారు.

గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన  సప్తగిరి ఇంచార్జ్ అధికారులు  వర్షాకాలంలో గిరిజనులకు ఇబ్బందులు కలవకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని పిఓ తెలిపారు. భారీ వర్షాల కారణంగా గిరిజనులు  బయట ప్రపంచానికి రావద్దని  ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. ఐటిడిఏ పరిధిలో పనిచేసే అన్ని శాఖల అధికారులు గిరిజనులకు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు.