30 July, 2026 | 5:06 PM

కేసీఆర్‌పై బురదజల్లేందుకే బీజేపీ కాంగ్రెస్ కుట్ర

03-09-2025 01:01 AM

 రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 2(విజయక్రాంతి) కెసిఆర్ పై బురదల్లేందుకే బిజెపి కాంగ్రెస్ కుట్ర.రైతు సమస్యలను పక్కనపెట్టి కేసీఆర్ మీద కాలేశ్వరం ప్రాజెక్టుతో తప్పుడు ఆరోపణ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఆనాటి పాలనే బాగుండే అని రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ నివేదిక ఎంక్వయిరీ కోరడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ.బిఆర్‌ఎస్ పార్టీ ని కావాలనే బదనాం చేయాలని కుట్రతో ఇలాంటి ఫిరాయింపులు చేస్తున్నారని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు కలిసి బిఆర్‌ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని కుట్రలు పండుతున్నారని, లక్ష కోట్ల అవినీతితో అబద్ధాపు పునాదులు వేస్తున్నారని తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్టు కోటి ఎకరాలకు నిరందిస్తుందని సూచించారు. రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, రైతుల సమస్యలను పట్టించుకోకుండా కెసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టుతో తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు జీవనాధారమైన కాలేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణ సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రవీణ్, చీటి నర్సింహారావు, బొల్లి రామ్మోహన్, మనోజ్,తదితరులు పాల్గొన్నారు.