బీజేపీ అవినీతితో దేశానికి ముప్పు
22-06-2024 12:05 AM
న్యూఢిల్లీ, జూన్ 21: నీట్, నెట్ పరీక్ష పత్రాల లీక్‌పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అవినీతితో దేశానికి ప్రమాదం ఏర్పడుతున్నదని విమర్శించారు. బీజేపీ పాలనలో జరుగుతున్న ప్రశ్న పత్రాల లీక్ దేశ సమస్యగా మారిం దని, కోట్ల మంది యువత భవిష్య త్తును నాశనం చేస్తున్నదని ఆరోపిం చారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘గ ఐదేండ్లలో దేశంలో 43 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. బీజేపీ పాలనలో పేపర్ లీకులు జాతీయ సమస్యగా మారాయి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.






