తజకిస్థాన్‌లో హిజాబ్‌పై నిషేధం
22-06-2024 12:05 AM
న్యూఢిల్లీ, జూన్ 21: ముస్లిం దేశం తజకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. ముస్లిం మహిళలు తలచుట్టూ ధరించే హిజాబ్‌పై నిషేధం విధించింది. హిజాబ్ మనుషులు ధరించాల్సినది కాదని, గ్రహాంతరవాసులు ధరించే వస్త్రమని వ్యాఖ్యా నించింది. ముస్లిం పర్వదినాల్లో చిన్నారులు పెద్దల నుంచి డబ్బులు అడుక్కొనే ‘ఇది’ సంప్రదాయాన్ని కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. తజకిస్థాన్ జాతీయ సంస్కృతిని అభివృద్ధి చేయటంలో భాగంగానే అరబ్ సంప్రదాయమైన హిజాబ్‌ను నిషేధించినట్టు ఆ దేశాధ్యక్షుడు ఓ ప్రకటన విడుదల చేశారు. తజకిస్థాన్ జనాభాలో 96 శాతం ముస్లింలే ఉంటారు.






