స్పేస్‌స్టేషన్‌కు భారత వ్యోమగామి
22-06-2024 12:05 AM
నాసా డైరెక్టర్ బిల్ నీల్సన్ వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 21: భారత్‌కు చెందిన వ్యోమగామి త్వరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తా డని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డైరెక్టర్ బిల్ నీల్సన్ ప్రకటించారు. భారత్ మధ్య ఇటీవల జరిగిన ఐఈసీటీ చర్చల్లో ఈమేరకు నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక సమాచార మార్పిడిలో భాగంగా భారత వ్యోమగాములకు నాసా శిక్షణ ఇవ్వనున్నదని వెల్లడించారు. ‘అంతరిక్ష పరిజ్ఞానం, కీలకమైన ఇతర సాంకేతికతలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటంలో భారత్ తమ సంబంధాలను మరిం త బలోపేతం చేసుకొంటున్నాయని వివరించారు. భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కు పంపే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.






