25 June, 2026 | 1:19 AM

డ్రైనేజీల్లో పూడిక, మరమ్మతులు చేపట్టాలని బీజేపీ కౌన్సిలర్ల వినతి

25-06-2026 12:00 AM

కామారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి):జిల్లా కేంద్రంలోని డ్రైనేజీ ల మరమ్మతులు, పూడిక తీత పనులు చేపట్టాలని ఇన్చార్జి కమిషనర్ టిపిఓ వినీత్ కుమార్ కు బిజెపి కౌన్సిలర్లు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.  వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరమ్మత్తులు చేయాలని,  పూడిక తీయాలని, కోరారు. 

ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ గత వర్షా కాలంలో వరదల వల్ల పాడైన డ్రైనేజీ లను మరమ్మత్తు చేయించాలని,  కొద్ది పాటి వర్షాలకు నీరు రోడ్డుపై కి రాకుండా పెద్ద పెద్ద డ్రైనేజీలలో పూడిక తీయించాలని, చుట్టు పేరుకు పోయిన గడ్డి తీసివేయాలని కోరారు. ప్రతి డ్రైనేజీ క్లీనింగ్ చేయించాలని వినతిపత్రం లో పేర్కొన్నారు.అవసరం ఉన్న చోట కల్వర్టు ల నిర్మాణం చేపట్టి రోడ్డుపైకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, భాను ప్రసాద్, మహిళా కౌన్సిలర్ లు పాల్గొన్నారు.