calender_icon.png 19 January, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి

19-01-2026 12:38:48 AM

ప్రజలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు

ఆదిలాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. సమస్యల పరిష్కారానికి, అదిలాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అటెండర్ కాలనీ వాసుల విన్నపం మేరకు కాలనీలో పర్యటించారు. హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు.

అనంతరం పలువురు కాలనీవాసులు వారి ఇబ్బందులను, సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధోనే జ్యోతి, అజయ్, గంగాధర్ చారి, రాజు, శివ పాల్గొన్నారు.