19-01-2026 12:37:28 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆసిఫాబాద్ క్రికెట్ కప్ సీజన్ 2 ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన విన్న ర్, రన్నర్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో ఎఎంసీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, సింగిల్ విండో మాజీ చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సకోల సరస్వతి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ క్రీడాకారులు పాల్గొన్నారు.