19-01-2026 12:39:37 AM
తుంగతుర్తి, జనవరి 18: మండలంలోని వెంపటి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో నిరూపించుకున్నారు. తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్‌ఎస్ ఆవరణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగవ తరగతి ప్రవేశానికి మండల పరిధిలోని వెంపటి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు గౌరు అక్షయ్ కుమార్, చిర్ర కీర్తన ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట రామనరసమ్మ అన్నారు.
ఈ మేరకు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి మెమొంటో అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట రామనరసమ్మ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్రీడా పాఠశాలలకు విద్యార్థులు ఎంపికవుతూ రావడం వెంపటి పాఠశాల ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్, గుండ్ల ఆంజనేయులు, బండారు భవాని, మిట్ట గడుపుల విక్రం, మాలోతు కృష్ణ, రామణ బోయిన మౌనిక, అబ్బ గాని మంజుల, శీలోజు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.