6 April, 2026 | 2:45 AM

ప్రతి ఇంటిపై బీజేపీ జెండాను ఎగరేయాలి

06-04-2026 12:35 AM

రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్ ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : బీజేపీకి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి బిజెపి కార్యకర్త తమ తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, దేశభక్తి నీ ప్రజల్లో పెంపొందించడం, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేఎంసీ జనరల్ సెక్రటరీ నీరుడు పవన్ సాయి తో పాటు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, సీనియర్ నాయకులు మహాలింగం, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.