6 April, 2026 | 9:59 PM

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

06-04-2026 08:12 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని 60వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ భాస్కర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ జాతీయ వాదాన్ని నరనరాన నింపుకొని దేశంకోసం, ధర్మం కోసం పార్టీ సిద్ధాంతం కోసం, ప్రాణాలర్పించిన, కార్యకర్తలను స్మరించుకుంటూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు కృషి సల్పిన బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, మద్దతుదారులందరికీ పేరుపేరునా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

1980లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్ పాయ్ లాంటి మహోన్నత మైన మహనీయుల మార్గదర్శనం లో నడుస్తూ, ఈ దేశంలోని చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే "అం త్యోదయ" లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఏకైక జాతీయ వాద పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు.

ఈ పార్టీలో పనిచేస్తున్న కార్య కర్తలు అంతా కూడా గర్వంగా ముందుకు నడు స్తున్నారని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన సమయంలో ఏవైతే కలలు కన్నారో గత 12 ఏళ్లుగా అవన్నీ అందించడంలో రెండు ప్రభు త్వాలు విఫలమయ్యాయి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే ఇటీవల జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బిజెపికి మంచి ఫలితాలు వస్తున్నాయని,ఇదే స్ఫూర్తితో, కార్యకర్తల బలంతో నాయకులందరూ ముందుకు వెళ్లి వచ్చే వరంగల్ మేయర్ ఎన్నికల్లో బిజెపిని విజయతీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు.