27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది

06-04-2025 08:00 PM

పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావుతో కలిసి ధోని శ్రీశైలం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో భాజపా పార్టీ అధికారంలోకి రావడం కాయం అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగిల మల్లికార్జున్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటురీ జయరాజ్, నాయకులు ప్రసాద్ గౌడ్, దీపక్ రావ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.