27 June, 2026 | 8:28 PM

నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం

27-06-2026 07:19 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మద్నూర్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరిన నిరంతరం శ్రమిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు  ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు  గోడ గడియారాలను పంపిణీ చేశారు.​ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ ప్రతి ఇంటి అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం శ్రమిస్తామని భరోసా ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.