27 June, 2026 | 7:59 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2.63 లక్షల జరిమానా   •   నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •  

మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు

27-06-2026 07:09 PM

చేర్యాల: చేర్యాల పెద్ద చెరువు కట్టపై ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అధికారులు ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణను మాత్రం పూర్తిగా గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం చేర్యాల మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి అలవాటుగా మారింది. కేవలం ఫోటోల ప్రచారం కోసమే కాకుండా,పర్యావరణంపై నిజమైన బాధ్యతతో పని చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించి, నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి,నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని చేర్యాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.