31 May, 2026 | 12:30 AM

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై బీజేపీ ప్రత్యేక సమావేశం

31-05-2026 12:00 AM

వక్త పొన్నం వెంకటరమణ

నాగోల్, మే 30 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్యా లయంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వక్త పొన్నం వెంకటరమణ కార్యకర్తలకు ఎస్‌ఐఆర్ అంశంపై సమగ్ర అవగాహన కల్పించా రు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, డివిజన్ ప్రభారి బం డారి భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, బూత్ స్థాయి నిర్వహణ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూ చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.