18 April, 2026 | 4:05 PM

Breaking News

మహిళా సాధికారతకు కాంగ్రెస్సే అడ్డంకి..   •   కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ నేతలు

02-03-2026 02:03 AM

గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి వినతి

కందుకూరు, మార్చి 1 (విజయక్రాంతి):కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో కందుకూరు మండలానికి చెందిన బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో నెలకొన్న రహదారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెల్లి నిధుల మంజూరుకై విన్నవించారు.

ముచ్చర్ల సర్పంచ్ ఊటు పద్మ భర్త మహేందర్, దాసర్లపల్లి సర్పంచ్ టేకుమట్ల బాలరాజ్ మరియు రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డిలు కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని కోరారు.ఆయా గ్రామాలను కలుపుతూ నూతన రోడ్డు నిర్మించాలన్నారు.బేగరి కంచ నుండి సార్లరావుల పల్లి తండాలు,ఊట్లపల్లి, ముచ్చర్ల, దాసర్లపల్లి వరకు అనుసందానించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రిరహదారి నిర్మాణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ముచ్చర్ల ప్రాంత అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తెరటి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ బక్క మల్లేష్, ఉప సర్పంచ్ తెరటి రవి, వార్డు సభ్యులు కోటిగాని అశోక్, మాదారం కృష్ణ గౌడ్, రాజు, రవి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.