26 June, 2026 | 8:54 PM

రెడ్లకుంటలో సర్ ఫారాల పంపిణీ

26-06-2026 07:28 PM

కోదాడ,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా, రెడ్ల కుంట గ్రామంలో ఓటర్ల నమోదు, సవరణ ఫారాల పంపిణీ శుక్రవారం నిర్వహించారు.. సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్ రావు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, సర్ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ రామారావు, నాయకులు పిడమర్తి సిద్దయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.