ఆర్మూర్ లో 2కె రన్
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 2కె రన్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పోలీస్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ భారతదేశంలో డ్రగ్స్ గురించి సమాజంలో ఎక్కువ శాతం యువత వాడుతున్నారని దీనికి తల్లిదండ్రులు పిల్లలకు వారి యొక్క ప్రవర్తన గమనించకపోవడం దీనికి ముఖ్యమైన కారణమని అన్నారు.
డ్రగ్స్ కు బానిసలై యువత చదువును, ఉద్యోగాన్ని కోల్పోయి నేరాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. అందుకు తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు ఏమైనా ఇంట్లో ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలపాలని, డి అడిక్షన్ సెంటర్లో ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలంటే యువత వలన ఉంది అని తెలిపారు. కళాశాలలో వెళ్లే విద్యార్థులు సెంటర్ వద్ద ఎటువంటి మత్తు పానీయాలు ఉండకూడదని అందుకు యువతకు సరైన అవగాహన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో డ్రగ్స్ రహిత సమాజ కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






