2 March, 2026 | 3:49 AM

యూరియా దొరక్క అన్నదాత అవస్థలు

02-03-2026 02:04 AM

ఆమనగల్లు బ్లాక్ మండలం లో ఎరువుల కొరత తీవ్రం

ఆమనగల్లు, మార్చి 1 (విజయక్రాంతి): అమనగల్లు బ్లాక్ మండలాల్లో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యం గా ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో యూరియా నిల్వలు నిం డుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పంటలు పొట్ట దశకు చేరుకున్న ఈ సమయంలో యూరియా వేయక పోతే దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఉంద ని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

 యాప్లో నిల్వలు సున్నా.. క్షేత్రస్థాయిలో అవస్థలు.....

ప్రభుత్వం పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్లో ఏ ఒక్క షాపులోనూ యూరియా స్టాక్ ఉన్నట్లు చూపించడం లేద ని రైతులు వాపోతున్నారు.డీలర్ల వద్ద నిల్వ లు ఉన్నప్పటికీ, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలకు నత్రజని (యూరియా) ఎంతో అవసరం. సకాలంలో ఎరువు అందకపోతే మొక్క ఎదుగుదల నిలిచిపోయి, పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏ ర్పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం....

ఎరువుల సరఫరాను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కనీసం స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ప్రతి ఏటా సాగు సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతు న్నా, ముందస్తు ప్రణాళికలు ఎందుకు చేయడం లేదని నిలదీస్తున్నారు.

రైతుల డిమాండ్లు.....

జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ప్రత్యేక కోటా కింద అదనపు యూరియా ని ల్వలను పంపిణీ చేయాలి.ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టి, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చే యాలి.ప్రతి రైతుకు అందుబాటులో ఉండే లా గ్రామ స్థాయిలోనే పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.తమ గోడును ఆలకించి, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టక పోతే కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని ఆమనగల్లు ప్రాంత రైతులు హెచ్చరిస్తున్నారు.