26 June, 2026 | 8:44 PM

ప్రధాన రహదారిపై విరిగిపడ్డ ముళ్ల చెట్టు

26-06-2026 07:37 PM

వాహనదారులకు ఇబ్బందులు

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట మండలం నుంచి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారిపై, లోడుపల్లి గ్రామ శివారులో ముళ్ల చెట్టు విరిగిపడి ప్రమాదకరంగా మారింది. రహదారిపై చెట్టు కొమ్మలు పడిపోవడంతో బస్సులు, ఆటోలు తదితర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముళ్ల కొమ్మలు వాహనాలకు తగిలే ప్రమాదం ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించి రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.