17 July, 2026 | 12:25 AM

జగన్నాథ రథయాత్రకు స్వాగతం పలికిన బీజేపీ నాయకులు

17-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): జగన్నాథ స్వామి రథయాత్ర గురువారం ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమై ఆర్ టిసి క్రాస్ రోడ్స్ మీదుగా వైభవంగా కొన సాగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తు రథయాత్రకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, బీజేపీ నాయకులు. భక్తిశ్రద్ధలతో జగన్నాథుని స్మరించుకుంటూ  రథయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, సాయి గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.