నిరుద్యోగుల మహార్యాలీ భగ్నం
17-07-2026 12:00 AM
దిల్‌సుఖ్ నగర్‌లో అడ్డుకున్న సరూర్ నగర్ పోలీసులు
ఎల్బీనగర్, జులై 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉ ద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాం డ్ చేస్తూ, ‘5వేలు వద్దు 19వేలు ముద్దు‘ అనే నినాదంతో దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం నిరుద్యోగ యువత భారీ మహాధర్నా నిర్వహించారు. అయితే ఈ ర్యాలీని సరూర్‌నగర్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పలువు రు నిరుద్యోగులు మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను 5 వేల నుంచి కనీసం 20 వేల వరకు పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగాల సంఖ్య పెంచడంతో పాటు వయోపరిమితి సడలింపు కొనసాగించాలని కోరారు.






