అట్టహాసంగానే బీజేపీ నామినేషన్లు
l ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్
l హాజరుకానున్న కేంద్ర మంత్రులు, కీలక నేతలు
l ఈ నెల 19న కిషన్ రెడ్డి నామినేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నెల 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుం టున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే నామినేషన్ల దాఖలు సమయంలో భారీగా జనసమీక రణ చేయాలని ఆలోచిస్తున్నది. అంతేకాకుం డా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఈ కార్యక్రమాలకు ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో నామినేషన్ల కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. నామినేషన్ల కార్యక్రమాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఎంపీ నియోజకవర్గాల బాధ్యులు క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు హాజరయ్యే అతిథులు...
తేదీ అభ్యర్థి అతిథి
ఏప్రిల్ 18 రఘునందన్ రావు (మెదక్) గోవా సీఎం ప్రమోద్ సావంత్
కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
ఏప్రిల్ 18 ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి) కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
ఏప్రిల్ 18 డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
ఏప్రిల్ 19 కిషన్ రెడ్డి( సికింద్రాబాద్) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఏప్రిల్ 19 తాండ్ర వినోద్ రావు (ఖమ్మం) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఏప్రిల్ 22 బీబీ పాటిల్ (జహీరాబాద్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
దేవేంద్ర ఫడ్నవీస్
ఏప్రిల్ 22 కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఏప్రిల్ 22 సైదిరెడ్డి (నల్గొండ) కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఏప్రిల్ 22 సీతారాం నాయక్ (మహబూబాబాద్) కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
ఏప్రిల్ 23 బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 24 గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 24 గోడం నగేశ్ (ఆదిలాబాద్) చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్
ఏప్రిల్ 24 మాధవీలత (హైదరాబాద్) కేంద్ర మంత్రి అరుణ్ ఠాకూర్
ఏప్రిల్ 24 ఆరూరి రమేశ్ (వరంగల్) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 25 బండి సంజయ్ (కరీంనగర్) గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్,
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏప్రిల్ 25 ధర్మపురి అరవింద్ (నిజామాబాద్) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 25 పోతుగంటి భరత్ (నాగర్ కర్నూలు) గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్,
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి






