25 May, 2026 | 3:02 AM

అర్హతలు లేనివారికి ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టులు

25-05-2026 02:07 AM

మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులను ఓదార్చిన మాజీ మంత్రి

వనపర్తి, మే 24 (విజయక్రాంతి): అర్హతలేని ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలకు కాంటాక్టులు ఇవ్వడం వల్ల రైతులకు ఈ దుస్థితి దాపురించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్న చిత్తశుద్ధిలేని ప్రభుత్వం,అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతులు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం నీటి పాలు అవుతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెట్టడం చేతనైతది కానీ శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేండ్లు అయిన నేటికి హంతకులను పట్టుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. పత్రికా సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మార్కెట్ మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, పలుస. రమేష్ గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు మాణిక్యం, వనం.రాములు,జోహెబ్ హుస్సేన్,మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, సయ్యద్. జెమిల్, బాగ్యరాజ్ తదితరులు ఉన్నారు.

మార్కెట్ యార్డ్ సందర్శించి రైతులను పరామర్శ..

వనపర్తి మండలం చిట్యాల లో గల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించి రైతులను పరామర్శించి ఓదార్చారు.  ప్రభుత్వ నిర్లక్ష్యవల్ల నోటికాడికి వచ్చిన ధాన్యం నీటి పాలు అయ్యిందని తడిసిన ప్రతిగింజా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.