కొత్త రేషన్ షాపులు ఎక్కడ?
- డీలర్ల ఎంపికకు పరీక్ష, ఇంటర్వ్యూ పూర్తి
- ఏడాదైనా జాడేలేని కేటాయింపులు
- పైరవీలకు పెద్ద పీట అంటూ ఆరోపణలు
కరీంనగర్, మే24(విజయక్రాంతి):కరీం నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ షాపుల కేటాయింపుప్రక్రియను ఏడాది దాటిన తరువాత పూర్తి చేయడం అనుమానాలకు తావునిస్తుంది.గత ఏడాది నిర్వహించిన పరీక్షా ఫలితాలు మూడు సార్లు వాయిదా వేశారు. దరఖాస్తుదారులు ఆందోళనకు డిగారు కూడా తొలుత ఏప్రిల్ 30, 2025న రేషన్ షాపు డీలర్ పోస్టుల ప్రకటన ఉంటుందని ప్రకటిం చారు. తర్వాత మే 3న, అని చివరకు చివరి వారంలో ప్రజాటించారు. ఏడాది నుండి ఆశావహులు ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
1:5, 1:3 పద్ద తిలో పరీక్షా ఫలితాల ద్వారా ఎంపిక చేస్తారని, ఇలా ఎంపిక చేసినవారి నుండి ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పడంతోడివిజన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసిబా ఫలితం దక్కలేదు . కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 68 డీలర్ షాపులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గంగాధర మండలం లోని ర్యాలపల్లి, ఉప్పరమల్యాల1, ఉప్పరమ ల్యాల2, తాడిజెర్రి, నారాయణపూర్, మాన కొండూర్ మండలం అన్నారం, ఖాదర్ గూడెం, గంగిపెల్లి, మానకొండూర్ 1, మాన కొండూర్ 2, పచ్చునూరు, శంషాబాద్, వేగురుపల్లి, నిజాయితీగూడెం, చొప్పదండి మండలంలోని చొప్పదండి.
గుమ్లాపూర్,కాట్నపల్లి, కొమురవెల్లి, గన్నేరువరం మండ లంలోని చాకలివానిపల్లి, యాస్వాడ, చొక్కారావుపల్లి, కొత్తపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, కొత్తకొండాపూర్, కరీంన గర్ పట్టణంలోని షాషామహల్ రోడ్, మార్కెట్ రోడ్, హుస్సేనురా, భాగ్యనగర్, మార్కండేయనగర్, టెలిఫోన్ క్వార్టర్స్, విద్యానగర్, రాంనగర్, గోదాంగడ్డ, కోరా స్కూల్, విద్యానగర్ డీలర్ షాపుల కోసం ప్రకటించిన రిజర్వేషన్ల వారీగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరీక్ష నిర్వహించారు.
10వ తరగతి ఆపైన చదివి ఉండి 18 సంవత్సరాలు నిండినవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించి పరీక్ష నిర్వ హించారు. వెయ్యి మందికిపైగా పరీక్ష రాశారు. అయితే ఫలితాల ప్రకటన, ఎంపిక గోప్యంగా జరగడం అనుమానాలకు తావునిస్తుంది.ఫలితాలు ప్రకటించిన అనంతరం మార్కులవారీగా ఎంపికైనవారి నుండి ఇంటర్వ్యూ నిర్వహించకుండా పైరవీలకు పెద్దపీట వేయడంతో ఏడాదిగా ఎగిరి చూసిన ఆశావాహులు నిరాశకులోనైనారు.
బినామీ పేరుతో...
కొత్త రేషన్ షాపులను బినామిల పేరుతో కొందరు డీలర్లు, పి డి ఎఫ్ అక్రమ రవాణా చేసే బారు దక్కించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికి చాలామంది రెండు నుండి మూడు షాపులను నడుపు తున్నారు. ఉదాహరణ తీసుకుంటే 101 నంబర్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి 111 నంబర్ షాపును కూడా నడిపిస్తున్నారు. ఇతను తాజా కేటాయింపుల్లో ఒక షాపును దక్కించుకున్నట్టు తెలిసింది. ఇలా సీనియర్ డీలర్ల గుప్పిట్లో రేషన్ దుకాణాలు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడింది పాట గా నడుస్తుంది.






