యూనిఫాంలు ఇవ్వకపోవడంపై బీజేపీ ఆగ్రహం
అక్కన్నపేట,(విజయక్రాంతి): అక్కన్నపేట మండలం పంతుల తండా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)ను గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు సందర్శించారు. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాంలు అందించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలోనే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ నాయకులు విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా వెంటనే యూనిఫాంలు పంపిణీ చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కరుణాకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, మండల కార్యదర్శి లావుడ్య రైనా నాయక్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మాలోత్ రాజు నాయక్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గంగుల కుమార్, వడ్లూరి తేజతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.






