ఉద్యమ స్ఫూర్తిని చాటిన మహానుభావుడు జయశంకర్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షే ఉద్యమానికి అసలైన బలం అంటూ ఉద్యమ స్ఫూర్తిని చాటిన మహానుభావుడు ప్రొ. జయశంకర్ అని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ వార్డులో తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ హాజరై జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వీయ పాలనకు ప్రతీకగా నిలిచిన మహనీయుడి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన జయశంకర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు సాంబశివ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వేముల శ్రీనివాస్, ధర్మా రెడ్డి, బాల్ రెడ్డి, సాయిరెడ్డి సురేందర్ రెడ్డి, టీఎస్. రెడ్డి, నర్సింహా రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, బెంబడి బుచ్చి రెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.






