19-04-2025 10:35:28 PM
కడ్తాల్: భారతీయ జనతా పార్టీ కడ్తాల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం కడ్తాల్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు దోనాదుల మహేష్ మాట్లాడుతూ... నేషనల్ హెరాల్డ్ కేసులో చట్టం తన పని తను చేసుకుంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జీలో పెట్టడంపై కడ్తాల్ కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా దిష్టిబొమ్మ కాల్చడాన్ని, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి పైన నరేంద్ర మోడీ పైన అసభ్య పాదాజాలం అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ అద్దంకి దయాకర్ వాక్యాలను కడ్తాల్ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, కోర్టును, రాజ్యాంగ చట్టబద్ధత కలిగిన ఈడి, సిబిఐ లను అవమానించే విధంగా ఈ చట్టాలను తప్పు బట్టి బిజెపి పైన నరేంద్ర మోడీ పైన అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇవ్వలేక పూర్తిగా విఫలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ అనే పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.
ప్రజలు కాంగ్రెస్ ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు వెంటనే తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి లాల్ నాయక్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి భగీరత్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీశైలం గౌడ్, మాజీ మండల అధ్యక్షులు, మన్యా నాయక్, జంగం వెంకటేష్, సాయి ప్రభు, విక్రమ్, రాజు కరుణాకర్ రెడ్డి, అంజయ్య, మధు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.