calender_icon.png 21 May, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైప్ లైన్ లీకేజ్ లకు మరమ్మతులు

19-04-2025 10:29:42 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా పట్టణంలోని అబ్రహం నగర్ సింగరేణి సరఫరా చేసే తాగునీటి పైపు లైన్ లీకేజీలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు మరమ్మతుల కొరకు స్వచ్చందంగా కూలీల కొరకు డబ్బులను జమచేసుకొని లీకేజీలు ఉన్న చోట తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు స్పందించి తమ యంత్రాంగన్ని పంపించి లీకేజీ ఉన్న పైపు తీసివేసి కొత్త పైపు లైన్ లను అమర్చారు. దీనితో స్థానికులు సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి సరఫరా లీకేజీల సమస్యను రాజకీయం చేయవద్దని కాలనీవాసులు నాయకులను కోరారు.