13 June, 2026 | 2:57 AM

తిప్పాపురం హైస్కూల్‌లో ‘బీజేపీ స్వచ్ఛ పాఠశాల’

13-06-2026 01:51 AM

వేములవాడ, జూన్ 12,(విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ‘మనబడి-మన బాధ్యత‘ కార్యక్రమంలో భాగంగా వేములవాడ - తిప్పాపురం హైస్కూల్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను శుభ్రపరిచి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన 12 ఏళ్లు పూర్తున సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు, పరీక్ష ఫీజులు అందజేస్తామని పేర్కొన్నారు. కౌన్సిలర్ మైలారం శ్రీనివాస్, కార్యక్రమ ఇంచార్జి ఎర్రం మహేష్ విద్యార్థుల సంక్షేమం కోసం బండి సంజయ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, రేగుల రాజ్కుమార్, రేగుల మల్లికార్జున్, వంగల శ్రీనివాస్, పిన్నింటి హన్మాండ్లు,రేగుల శ్రీకాంత్, మామిళ్ల లక్ష్మీరాజం, చిక్కుడు మల్లేశం,వాసం మల్లేశం,బిల్ల కృష్ణ,నామాల శేఖర్,వివేక్ రెడ్డి, నేరెళ్ల సాయి, అన్నం నర్సయ్య, జగన్నాథం శ్రీను,కిరణ్, మొక్షిత్ తదితరులు పాల్గొన్నారు.