28 July, 2026 | 11:20 AM

కలెక్టరేట్ ఆవరణలో కంపు కంపు!

28-07-2026 10:34 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మార్జాలం చనిపోయి ఆవరణ పూర్తిగా దుర్గంధ భరితంగా మారడంతో ప్రజలు, అధికారులు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ ఆవరణ ప్రకృతి రమణీయతకు ఈ ఘటన భిన్నంగా నిలుస్తోందని, పరిశుభ్రతను సక్రమంగా పర్యవేక్షించడం లేదని విమర్శలు వస్తున్నాయి. వెంటనే స్పందించి మార్జాలం కళేబరాన్ని తొలగించి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .