13 June, 2026 | 2:59 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచాలి

13-06-2026 01:52 AM
  1. బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి
  2. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని, విద్యార్థులు వివరాలు సేకరించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి  అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ స్త్రీ, శిశు సంక్షేమ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ అంగన్వాడి కేంద్రాలలో చదువుతున్న పిల్లల వివరాలు, ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య పూర్తి సమచారం సేకరించి సిద్ధం చేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలో 3 సం లోపు పిల్లల అడ్మిషన్లు పెంచాలని, వారికి రుచికరమైన ఆహారం అందించాలన్నారు. ఇంటర్మీడియట్ పిల్లల విద్యా సామర్ధ్యాలు పెంచేందుకు ప్రతీ మాసం స్లిప్ టెస్టులు నిర్వహించాలని, కళాశాలలో మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే చేయాలని, భవనాలు స్థితిగతులను పరిశీలించాలని, నూతన భవనాలు మరిన్ని అదనపు తరగతి గదులు ఏవైనా మరమ్మతులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు.

వసతి గృహాల నిర్వహణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు బారిన పడకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు..జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డుల నిర్వహణ ప్రిన్సిపల్ లో లెక్చరర్స్, విద్యార్థిని విద్యార్థుల యొక్క హాజరు శాతం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు..ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, కళాశాల  ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.