calender_icon.png 5 October, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లి మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం

04-10-2025 06:53:41 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమానికి జడ్పిటిసి ప్రభరి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జడ్పిటిసి ప్రభరి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలంతా ఏకతాటిపై పనిచేయాలని, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.