calender_icon.png 5 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీ టీం బృందం

04-10-2025 06:54:04 PM

మహిళలు, చిన్నారుల భద్రత సురక్షత ముఖ్యం..

ఈ నెలలో ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు..

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న షీ టీం బృందం.

మహిళలకు అందుబాటులో నిజామాబాదు షీ టీం..

26 అవగాహన కార్యక్రమాల నిర్వహణ..

గత నెలలో 80 సార్లు హాట్స్పాట్ ల తనిఖీ..

11 ఈ పెట్టి కేసుల నమోదు..

07  కౌన్సిలింగ్ నిర్వహించి సమస్య పరిష్కారం.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, వెల్లడి..

నిజామాబాద్ (విజయక్రాంతి): ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షీ టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకై, రక్షణకై నిజామాబాదు జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు, షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు షీ టీం బృందాలు యువతులకు, విద్యార్థిని విద్యార్థులకు, పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి తగు జాగ్రత్తలు సూచనలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేశారు. షీ టీం బృందాలు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 80 హాట్స్పాట్లలో తనిఖీ నిర్వహించింది. పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. షీ టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా, మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. 07 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడింది అని సీపీ తెలిపారు. 

ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలంటే 8712659795 నంబర్ ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. 26 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలపై, సోషల్ మీడియా నేరాలపై, చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెలలో మహిళల సమస్యలతో దాదాపు 07 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. షీ టీం బృంద సభ్యులు మహిళా RSI శ్రవంతి, హెడ్ కానిస్టేబుల్లు సుమతి, ఆశయ్యా, కానిస్టేబుల్ లు విగ్నేష్, శ్రీకాంత్, నాగరాజు, రేఖా రాణి, హరిత రాణి, రాధిక, మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణగా నిజామాబాదు పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని సీపీ సాయి చైతన్య హామీ ఇచ్చారు.