తెలంగాణపై బీజేపీది కపట ప్రేమ
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ అని మరొ కసారి బట్టబయలైందని పీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. వాస్తవా నికి బీజేపీకి రాష్ట్రంపై ఎన్నడూ ప్రేమ లేదు.. మరెప్పుడు రాదు అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా మరొకసారి నిరూపితమైందని ఆయ న ఆరోపించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమయం కోరారా..? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండి పడ్డారు. ఇంతటి కీలకమైన విషయంపై అనా లోచితంగా.. అవగాహనలేమి వ్యాఖ్యలు చేయ డం చాలా దారుణం అన్నారు. తెలంగాణ ప్రగతి పట్ల, ఈ రాష్ట్ర రైతులకు అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టులపై బీజేపీ చిత్తశుద్ధి ఏంటో స్పష్టంగా కనిపిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మే 6న, సీఎం రేవంత్‌రెడ్డి 26న మహరాష్ట్ర సీఎంకు లేఖ రాసిన విషయం తెలియకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రేవంత్‌రెడ్డి లేఖ రాసిన.. బీజేపీ నేతలు మాత్రం లేఖ రాయలేదని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు.. తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్‌కు అడ్డుపడి తెలంగాణ ప్రయోజనాలు కాల రాస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాంచందర్‌రావు మోసపూరిత వ్యాఖ్యలు సరికాదు.. ఇప్పటికే మా ప్రభుత్వం రాష్ట్రంలో 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించినం అని తెలిపారు.






